Kasimkota: నూతనగుంటపాలెంలో మెగా మెడికల్ క్యాంప్: భీమరశెట్టి రామ్కి
Kasimkota: కసింకోట మండలం నూతనగుంటపాలెంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌నకు అనకాపల్లి జనసేన ఇన్‌చార్జ్ భీమరశెట్టి రామ్కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Kasimkota: నూతనగుంటపాలెంలో మెగా మెడికల్ క్యాంప్: భీమరశెట్టి రామ్కి
అనకాపల్లి జిల్లా: కసింకోట మండలం నూతనగుంటపాలెం గ్రామంలో కూటమి ప్రభుత్వానికి చెందిన గ్రామ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి జనసేన పార్టీ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రామ్కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వైద్య శిబిరానికి హాజరైన వైద్యులను భీమరశెట్టి రామ్కి ఘనంగా సత్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని అన్నారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాల్సిన అవసరం ఉందని భీమరశెట్టి రామ్కి పేర్కొన్నారు. అనంతరం మెగా మెడికల్ క్యాంప్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు.
భవిష్యత్‌లో కూడా ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.




