Anakapalli: అర్నబ్ తుపాను ముప్పు.. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
Anakapalli: అర్నబ్ తుపాను నేపథ్యంలో అక్టోబర్ 27 నుంచి 29 వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు, అధికారులకు ఆదేశాలు.
Anakapalli: అర్నబ్ తుపాను ముప్పు.. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
Anakapalli: అర్నబ్ తుపాను నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం. ప్రతి మండల కేంద్రంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసాం. తుపాను పరిస్థితులపై సీఎం చంద్రబాబు వివిధ శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు. తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తుపాను నేపథ్యంలో ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అధికారులు చర్యలు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు నిలబడకూడదు. తుపాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది.
సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ప్రజలు నమ్మవద్దు. తుపానుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసే సూచనలు, ఆదేశాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలి.హోం మంత్రి అనిత.




