Anakapalli: భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్

Anakapalli: అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ విజయ క్రిష్ణన్. విద్యార్థుల భద్రతకే ప్రాధాన్యత.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 24 Sept 2026 11:09 PM IST
Anakapalli
X

Anakapalli: భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్

అనకాపల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

ఈ మేరకు జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. వాయుగుండం ప్రభావంతో జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నందున విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు.

జిల్లాలో వర్షాల పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సూచించింది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI