Anakapalli: వైసీపీకి షాక్.. కొణతాల సమక్షంలో జనసేనలోకి సత్యనారాయణ!

Anakapalli: అనకాపల్లి 112వ వార్డులో వైసీపీకి షాక్. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పలాకా సత్యనారాయణ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సమక్షంలో జనసేనలో చేరిక.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 24 Oct 2026 9:18 PM IST
Anakapalli
X

Anakapalli: వైసీపీకి షాక్.. కొణతాల సమక్షంలో జనసేనలోకి సత్యనారాయణ!

అనకాపల్లి: జీవీఎంసీ పరిధిలోని 112వ వార్డులో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నుంచి జనసేన పార్టీలోకి వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో, అనకాపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పలాకా సత్యనారాయణ జనసేన పార్టీలో చేరారు.

అనకాపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సమక్షంలో పలాకా సత్యనారాయణ జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను కొణతాల రామకృష్ణ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

112వ వార్డు పరిధిలో చోటుచేసుకున్న ఈ చేరిక స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI