Anakapalli: పొగచెట్లపాలెంలో ఘనంగా పోషణ్ మాసం కార్యక్రమం!
Anakapalli: అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పొగచెట్లపాలెంలో పోషణ్ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గర్భిణులు, చిన్నారులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు.
Anakapalli: పొగచెట్లపాలెంలో ఘనంగా పోషణ్ మాసం కార్యక్రమం!
Anakapalli: గొలుగొండ మండలం పొగచెట్లపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మాసం–2026 కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సీడీపీఓ శ్రీగౌరీ ఆదేశాల మేరకు అంగన్వాడీ టీచర్ శ్రీదేవి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించామని ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా ఉండేందుకు సమతుల్యమైన పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరమని ఆమె వివరించారు.
పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, రక్తహీనత నివారణ, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై మహిళలకు అవగాహన కల్పించారు. నెల రోజుల పాటు జరిగే పోషణ్ మాసం కార్యక్రమంలో భాగంగా పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రత తదితర అంశాలపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్ వరలక్ష్మి, గ్రామ మహిళలు పాల్గొన్నారు.




