Anakapalli: జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు - సెట్విస్ సీఈఓ రమ్య పిలుపు

Anakapalli: అనకాపల్లిలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలకు దరఖాస్తులు ఆహ్వానించిన సెట్విస్ సీఈఓ రమ్య. విజేతలకు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు అవకాశం.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 21 Sept 2026 9:23 PM IST
Anakapalli
X

Anakapalli: జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు - సెట్విస్ సీఈఓ రమ్య పిలుపు

అనకాపల్లి: అనకాపల్లి 21సెప్టెంబర్ 2026- 27 సంవత్సరమునకు గాను జిల్లా స్థాయి యువజన ఉత్సవాల లో అనకాపల్లి జిల్లాలో యువతి యువకులు పాల్గొనవలసిందిగా కోరుతూ రమ్య యువజన సర్వీసుల శాఖ మరియు సెట్విస్ ముఖ్య నిర్వహణ అధికారి పిలుపునిచ్చారు .

ఈ కార్యక్రమం లో 15 నుంచి 29 సంవత్సరంలు కలిగిన యువతీ యువకులు జానపద గేయాలు, జానపద నృత్యాలు, కవిత్వం, పెయింటింగ్, నాటకములకు సంబంధించి ఆసక్తి కలిగిన వారు పోటీలలో దరఖాస్తు చేసుకోవలసిందిగా తెలియజేశారు.

ఈ పోటీల్లో పాల్గొనదలచిన యువతి యువకులు ఈ దిగువ తెలిపిన లింక్ ద్వారా మరియు క్యూఆర్ కోడ్ ద్వారా తమ యొక్క వివరాలను నమోదు చేసుకోవలసినదిగా తెలియజేయబడినది. జిల్లా స్థాయి పోటీలలో మొదటి బహుమతి గెలుపొందిన యువతి యువకులను రాష్ట్రస్థాయి పోటీలకు తీసుకువెళ్లడం జరుగుతుంది.

రాష్ట్రస్థాయిలో గెలుపొందిన యువతి యువకులను 12 జనవరి, 2027న ఢిల్లీ భారత్ మండప్ లో నిర్వహింపబడే జాతీయ స్థాయి పోటీలకు తీసుకు వెళ్లడం జరుగును. కావున ఆసక్తిగల యువతీ యువకులు వెంటనే తమ యొక్క పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా సీఈఓ సెట్విస్ ముఖ్యకారి నిర్వహణ అధికారి రమ్య తెలియజేశారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM