Anakapalli: దేవరాపల్లి పీహెచ్‌సీలో డాక్టర్ల కొరత: సీపీఎం డిమాండ్!
Anakapalli: అనకాపల్లి జిల్లా దేవరాపల్లి పీహెచ్‌ఎంలో సెకండ్ మెడికల్ ఆఫీసర్ పోస్టును తక్షణమే భర్తీ చేయాలని సీపీఎం నేత డి. వెంకన్న డిమాండ్ చేశారు.
Anakapalli: దేవరాపల్లి పీహెచ్‌సీలో డాక్టర్ల కొరత: సీపీఎం డిమాండ్!
Anakapalli: దేవరాపల్లి, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో సెకండ్ మెడికల్ ఆఫీసర్ పోస్టును తక్షణమే భర్తీ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు దేవరాపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంను 2005 సంవత్సరంలో రోగులకు మేరుగైన వైద్యం అందించడం
24 గంటల ఆసుపత్రిగా అప్ గ్రేట్ చేసి కొంతకాలం ఇద్దరు డాక్టర్లు తో వైద్య సేవలు అందించడం జరిందన్నారు తరువాత డాక్టర్లు కొరత వల్ల ఓక్క డాక్టర్ తో కొంతకాలం నడి చిందన్నారు గత ప్రభుత్వం ఆదికారంలోకి వచ్చిన తరువాత ఇద్దరు డాక్టర్లు ను ఎర్పాటు చేయడం జరిందన్నారు జరిగిందన్నారు ప్రస్తుతం రెండో మెడికల్ ఆఫీసర్ బదిలీ పై వెళ్లి పోవడం వల్లన రోగులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని పేర్కొన్నారు దేవరాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రధానంగా గిరిజన ప్రాంతం గిరిజన గ్రామాల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల గిరిజనులు దూర ప్రాంతాల నుండి వచ్చి వైద్యం చేయించుకుని వెళ్తు ఉంటారని తెలిపారు
రాత్రిపూట డాక్టర్లు ఆరోగ్య కేంద్రంలో ఉండక పోవటం వలన గిరిజనులతో పేద మద్య తరగతి ప్రజలు తో పాటు గర్భిణీ స్త్రీలు ముసలి వారు చిన్న పిల్లలు పాము కాటు గురైన వాళ్ళు అనేక మంది ఇబ్బందులు పడు తున్నారని తెలిపారు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పక్కా బిల్డింగులు నిర్మించిన డాక్టర్లు వైద్య సిబ్బంది సరిపడా లేక పోవడం వల్లన చినపాటి రోగులకు కూడా అనకాపల్లి విశాఖపట్నం చోడవరం ప్రైవేట్ హాస్పటల్ కు ఆశ్రమిం చవలసి వస్తుందని తెలిపారు
ప్రధానంగా వాలాబు చింతలపూడి గర్సింగి తామరబ్బా పంచాయతీల్లో సుమారుగా 48 గిరిజన గ్రామాల్లో గిరిజనులు నివాసం ఉన్నారని వారందరూ ఇదే ఆసుపత్రి పై ఆధారపడి వైద్యం చేయించు కుంటున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్యం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తెలిపారు గ్రామాల్లో సభ సెంటర్లో గతంలో మందులు పుష్కలంగా ఉండేవని ప్రస్తుతం మందులు కొరత తీవ్రంగా ఉందన్నారు అవసర మైన మందులు అందు బాటులో ఉండటం లేదన్నారు
దీంతోపాటు అనంతగిరి మండలానికి చేందిన నాలుగు పంచాయతీ లకు చేందిన ఆదివాసీ లు దేవరాపల్లి కి ముఖ ద్వారం గా ఉండడం వలన అనాలుగు పంచాయ తీలకు చేందిన గిరిజనులు కూడా ఆసుపత్రి పై అదార పడి గర్భిణీ స్త్రీలు రాత్రి పూటలా వచ్చి వైద్యం చేయించు కుంటున్నారని తెలిపారు ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్లక్ష్యం చేయడం తగదన్నారు తక్షణమే సెకండ్ మెడికల్ ఆఫీసు పోస్ట్ తో పాటు వైద్య సిబ్బంది మందులు కొరతను నివారిందు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి చర్యలు తీసుకో వాలని, లేదంటే సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అందోన చేస్తామని స్పష్టం చేశారు,




