Chodavaram: చోడవరం మండలం వడ్డాది గ్రామంలో రైతులకు ‘పొలంబడి’ కార్యక్రమం!

Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం వడ్డాది గ్రామంలో వ్యవసాయ అధికారి నారాయణరావు ఆధ్వర్యంలో రైతులకు పొలంబడి కార్యక్రమం, కొత్త ఎరువుల బుకింగ్ యాప్ (FFS) పై అవగాహన కల్పించారు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 18 Nov 2026 5:32 PM IST
Chodavaram
X

Chodavaram: చోడవరం మండలం వడ్డాది గ్రామంలో రైతులకు ‘పొలంబడి’ కార్యక్రమం!

చోడవరం: ఈరోజు వడ్డాది గ్రామంలో పొలంబడి రైతులకు వరి కోత సమయంలో చేపట్టవలసిన జాగ్రత్తలు మరియు విత్తనం కోసం ఉంచుకునే రైతులకు ఏ విధంగా వరి కోతలు కోసి భద్రపరుచుకోవాలో ఈ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. మరియు రవి పంటకాలను సంబంధించి ఎటువంటి రకాలను ఎంచుకోవాలి మరియు ప్రధాన మడులు తయారు చేసుకునే విధానం విత్తన శుద్ధి నారుమడి వేసే విధానం కోసం రైతులకి వివరంగా తెలియజేయడమైనది.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ వారు ప్రవేశపెట్టిన కొత్త ఎరువుల బుకింగ్ అప్లికేషన్(FRAMEWORK FOR FERTILIZER SALE )కోసం రైతులకు వివరించడం జరిగింది. ఎరువులు కావలసిన ప్రతి ఒక్క రైతు కూడా తమ యొక్క స్మార్ట్ ఫోన్ లో ప్లే స్టోర్ ద్వారా(FRAMEWORK FOR FERTILIZER SALE ) అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని రైతు యొక్క ఆధార్ నెంబర్ తో గాని లేదా రైతు గుర్తింపు సంఖ్య(FARMER I'D )తో గాని లాగిన్ అయిన తర్వాత మీకు ఏ పంటకి ఏ ఎరువు కావాలో మీరే బుక్ చేసుకుని.

మీ సమీపంలో ఉన్న రైతు సేవా కేంద్రం దగ్గర లేదా ఎరువుల దుకాణం దగ్గరికి వెళ్లి మీ యొక్క బుకింగ్ నెంబరు తెలియజేసినట్లయితే మీరు ఎరువులు తీసుకోవచ్చు కావున ప్రతి ఒక్కరు కూడా మీ సమీపంలో ఉన్న రైతు సేవా కేంద్రం సిబ్బంది ద్వారా మీ యొక్క మొబైల్ ఫోన్లో ఈ అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో రైతు సేవ కేంద్రం అధికారిణి రేణుక, సాయి లక్ష్మి, పొలంబడి రైతులు పాల్గొన్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM