Chodavaram: కూటమి అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు ఎమ్మెల్యే రాజు కృతజ్ఞతలు!
Chodavaram: చోడవరం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించిన ప్రజలకు ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్. రాజు కృతజ్ఞతలు తెలిపి, వైసీపీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.
Chodavaram: కూటమి అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు ఎమ్మెల్యే రాజు కృతజ్ఞతలు!
చోడవరం: చోడవరం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్. రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్థానిక ఎన్నికల్లో భాగంగా పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా, వార్డు మెంబర్లుగా కూటమి నుంచి పోటీ చేసిన అభ్యర్థుల విజయానికి సహకరించిన ప్రజలకు, కార్యకర్తలకు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... స్థానికంగా ఉన్న పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా బియ్యం రోడ్డులో వడ్డాది వద్ద బ్రిడ్జి, విజయరామరాజుపేట మధ్య బ్రిడ్జి, రహదారిలో గోతులు... వీటి నిర్మాణం త్వరలోనే చేపడతామని తెలిపారు.
అభివృద్ధికి ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించినందుకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే చోడవరం సర్పంచ్ ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా గునూరు పెదబాబును ప్రజలు 8 ఓట్ల తేడాతో గెలిపించారని గుర్తుచేశారు.
అయితే ఈ విషయంలో వైసీపీ ఇన్‌ఛార్జ్ గుడివాడ అమర్నాథ్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎన్నికల లెక్కింపు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలోనే జరిగిందని... అందులో తాము ఎలా మానిప్యులేషన్ చేయగలమని ప్రశ్నించారు. ఓటమిని అంగీకరించలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని... ఇది వారికి కూడా మంచిది కాదని ఎమ్మెల్యే తెలియజేశారు.




