Anakapalli; విత్తన గుళికల తయారీపై రైతులకు అవగాహన!

Anakapalli: బుచ్చయ్యపేటలో విత్తన గుళికల తయారీపై రైతులకు అవగాహన: వరి నారు కొరతను అధిగమించే విధానం, ముదురు నారు నాట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏవో నారాయణరావు సూచనలు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 24 Sept 2026 3:23 PM IST
Anakapalli
X

Anakapalli; విత్తన గుళికల తయారీపై రైతులకు అవగాహన!

అనకాపల్లి: అనకాపల్లి జిల్లా చోడవరం నియజకవర్గ పరిధిలోని బుచ్చయ్యపేట మండలం ఎల్ బి పి అగ్రహారం, లోపూడి గ్రామాలలో రైతులకు విత్తన గుళికలు(Pelletization) తయారు చేసే విధానంపై బుచ్చయపేట మండల వ్యవసాయ అధికారి మళ్ల నారాయణరావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది .

దీని యొక్క ముఖ్య ప్రాధాన్యత ప్రస్తుతం కురుస్తున్న వానలు కు రైతులకు తగినంత వర్షపాతం ఉన్నప్పటికీ వరి నారుమడులు ముదురు పోవడం వలన లేక ఎండిపోవడం వలన వరి నారు అందుబాటులో లేదు కావున ఎవరికైతే వరి నారు లేనివారు విత్తన గుళికలు పద్ధతి ద్వారా వేసుకున్నట్లయితే నేలలో ఏమాత్రం తేమ శాతం ఉన్న మొలకెత్తి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పద్ధతి ఎక్కువగా కాయగూరలు పండించే రైతులు ఆచరించినట్లయితే మొలక శాతం ఎక్కువగా ఉండి నిర్ణీత సమయంలో మొలకెత్తి అవకాశం ఉంటుంది

గత వారం రోజులు నుండి కురుస్తున్న వర్షాల వలన రైతులందరూ కూడా ముమ్మరంగా వరి నాట్లు వేయడం జరుగుతుంది. ముదురు నారు ఉడిచేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు రైతులకి పొలాల వద్దకు వెళ్లి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేంద్రియ విభాగం సహాయకులు దేవి, రైతు సేవా కేంద్రం అధికారి రమణబాబు మరియు రైతులు పాల్గొన్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM