Anakapalli: వడ్డాది, వి.ఆర్. పేటల్లో వ్యవసాయ విద్యార్థుల పర్యట!

Anakapalli: అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది, వి.ఆర్. పేట గ్రామాల్లో వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు, కేవీకే శాస్త్రవేత్తలు నీటమునిగిన వరి పొలాలను పరిశీలించారు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 29 Oct 2026 5:46 PM IST
Anakapalli
X

Anakapalli: వడ్డాది, వి.ఆర్. పేటల్లో వ్యవసాయ విద్యార్థుల పర్యట!

అనకాపల్లి: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోని బుచయ్యపేట మండలంలో పలు గ్రామాలలో వడ్డాది, విజయరామరాజుపేట గ్రామాలలో వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు సందర్శన చేసారు, ఈ కార్యక్రమంని ఉద్దెశించి వవ్యసాయ అధికారి మాట్లాడుతు నీట మునిగిన వరి పొలాలు పరిశీలించి తుఫాన్ ప్రభావం పై రైతులుకి సూచనలు ఇవ్వడం జరిగిది. ఎత్తుగా ఉన్న పొలాలు పడిన చోట రైతులుకి రెండు నుండి మూడు దుబ్బులు కలిపి ఒక్క కట్టగా కట్టిన యెడల కొంత మేర నష్టాన్ని తగిoచవచ్చు అని తెలియజేసారు.

పడిపోయిన చేలలో గింజలు రంగు మారటం, మాగుడు తెగులు మరియు మానిపండు తెగులు వ్యాప్తి నివారించడానికి ఎకరాకు 200 మి.లీ. ప్రోపికోనాజోల్ పిచికారీ చేయాలి. అదేవిదంగా ఈ రోజు వర్షం తగ్గడం వలన నిన్న పొలాల్లో చేరిన నీరు మొత్తం దిగువస్థాయి చేరడం వలన వరి పైరుకి ఎటువంటి నష్టం వాటిల్లలేదు.

కోత దశలో నిలిచిన లేదా పడిపోయిన పంటలో కంకిలో మొలకలు కనపడితే, నీరు బయటకు తీసివేసిన తర్వాత , 5% ఉప్పు ద్రావణం (50 గ్రాములు కల్లు ఉప్పు / లీటరు నీటికి)కలిపి పిచికారీ చేయాలి. ఇది మొలకెత్తడాన్ని మరియు రంగు మారడాన్ని తగ్గిస్తుంది. ఈ కార్యక్రమంలో రైతు సేవ కేంద్రం సిబ్బంది మరియు వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు, కళాశాల భోదనా సిబ్బంది, కృషి విజ్ఞాన కేంద్రం కొండేంపూడి శాస్త్రవేతలు బాబు, రైతులు పోలగొన్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM