Anakapalli: బీఎంఎస్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు
Anakapalli: అనకాపల్లిలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించిన బీఎంఎస్. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భవన నిర్మాణ కార్మికులు, నాయకులు.
Anakapalli: బీఎంఎస్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు
అనకాపల్లి: విశ్వకర్మ జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి స్థానిక తుమ్మపాల జంక్షన్‌లోని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ భవనంలో ఈ కార్యక్రమం జరిగింది.
బీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు అధ్యక్షులు రాకోటి వెంకట సురప్పారావు, కార్యదర్శి పీల శ్రీను గణేష్ నేతృత్వం వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఎంఎస్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పెంటకోట ధనబాబు, EPDCL డిస్కం ప్రెసిడెంట్ అంతర్వేది బాబు హాజరయ్యారు. భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విశ్వకర్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విశ్వకర్మ జయంతి ప్రాముఖ్యతను భవన నిర్మాణ కార్మికులకు వివరించారు. నిర్మాణ రంగంతో పాటు వివిధ వృత్తులకు విశ్వకర్మను ఆదిగురువుగా భావిస్తామని తెలిపారు.




