Anakapalli: కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబ సమస్యలపై జేఏసీ అవగాహన!

Anakapalli: అనకాపల్లిలో ఏపీ ఎంహెచ్‌సీ జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబ సమస్యలపై అవగాహన: ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 24 Sept 2026 7:12 PM IST
Anakapalli
X

Anakapalli: కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబ సమస్యలపై జేఏసీ అవగాహన!

అనకాపల్లి: కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఉద్యోగ, ఆర్థిక, కుటుంబ సమస్యలను ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేసే ఉద్దేశంతో AP MHC JAC ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాల పరిస్థితులను వివరిస్తూ ప్రత్యేక వీడియో కార్యక్రమాన్ని చేపట్టారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకపోవడం, తక్కువ వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారడం, భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొనడం వంటి సమస్యలను ఈ కార్యక్రమంలో వివరించారు. ఉద్యోగ భద్రతతో పాటు తమ ఆర్థిక, కుటుంబ సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తగిన న్యాయం చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.

కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జేఏసీ ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ అనకాపల్లి జయలక్ష్మి, సతీష్, గాయత్రి, శోభా, దుర్గతో పాటు పలువురు జేఏసీ సభ్యులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI