Anakapalli: అనకాపల్లిలో ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో AMR చెక్ పోస్టుల వ్యతిరేక ఆందోళన

Anakapalli: అనకాపల్లిలో AMR అక్రమ చెక్ పోస్టులపై మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు నిరసన. చెక్ పోస్టులు ఎత్తివేయకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిక.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 28 Sept 2026 8:28 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లిలో ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో AMR చెక్ పోస్టుల వ్యతిరేక ఆందోళన

అనకాపల్లి: AMR ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. మాటూరు జంక్షన్ వద్ద ఆందోళన చేపట్టారు.

మాజీ ఇంటెలిజెన్స్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు ఈ ఆందోళనలో పాల్గొని.. AMR చెక్ పోస్టులు అక్రమంగా ఏర్పాటు చేశారని ఆరోపించారు. చెక్ పోస్టుల పేరుతో ఎలాంటి వసూళ్లు చేయడానికి వీలు లేదని.. అక్రమ వసూళ్లను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

చెక్ పోస్టు సిబ్బందిని ఆందోళనకారులు నిలదీసి.. చెక్ పోస్టుల నిర్వహణ, వసూళ్లపై ప్రశ్నలు సంధించారు. అయితే.. తమ ప్రశ్నలకు సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదని ఆందోళనకారులు తెలిపారు.

ఈ వ్యవహారంపై అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

అధికారులు స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని.. అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని ఏబీ వెంకటేశ్వరరావు హెచ్చరించారు.

ఇదే సమయంలో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ కార్యక్రమంలో నల్లమోర్తు చక్రవర్తి, అజయ్ మల్లారెడ్డి, సీపీఎం మండల కన్వీనర్ గంటా శ్రీరామ్, మొల్లేటి నవీన్, దాడి ప్రసాద్, దోరబాబు తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI