Anakapalle: మేయర్ అభ్యర్థిగా తన పేరును పరిశీలించాలని కోరిన నీలబాబు
Anakapalle: అనకాపల్లిలో మేయర్ అభ్యర్థిత్వం కోసం టీడీపీ అధినేత చంద్రబాబును కోరిన మాదంశెట్టి నీలబాబు. పార్టీ కోసం 44 ఏళ్లుగా సేవలు అందిస్తున్నానని వెల్లడి.
Anakapalle: మేయర్ అభ్యర్థిగా తన పేరును పరిశీలించాలని కోరిన నీలబాబు
అనకాపల్లి: తెలుగుదేశం పార్టీలో 44 సంవత్సరాలుగా కొనసాగుతూ పార్టీ కోసం పనిచేస్తున్న మాదంశెట్టి నీలబాబు.. రాబోయే మేయర్ అభ్యర్థిత్వంలో తన పేరును పరిశీలించాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. ఇటీవల విశాఖపట్నం పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడును కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేసినట్లు నీలబాబు తెలిపారు.
1986లో పంచాయతీ ప్రెసిడెంట్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మాదంశెట్టి నీలబాబు.. అనంతరం లంకెలపాలెం కో-ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. జెడ్పీటీసీగా, 2008లో ఎంపీపీగా పనిచేశారు. 2009లో ఎమ్మెల్సీగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2017లో స్టేట్ ఫారెస్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
అలాగే 2021లో మాదంశెట్టి నీలబాబు సతీమణి చిన్నతల్లి అనకాపల్లి పాత 84వ వార్డు కార్పొరేటర్‌గా విజయం సాధించారు. 2019లో వైసీపీ ప్రభావం ఉన్న సమయంలోనూ తమ వార్డులో భారీ మెజార్టీతో విజయం సాధించామని నీలబాబు పేర్కొన్నారు. అనకాపల్లి పరిధిలోని ఐదు వార్డుల్లో తమ వార్డు మాత్రమే విజయం సాధించిందని తెలిపారు.
టీడీపీలో నాలుగు దశాబ్దాలకు పైగా పనిచేసిన తన రాజకీయ అనుభవం, ప్రజా సేవను పరిగణనలోకి తీసుకుని మేయర్ అభ్యర్థిత్వానికి ఒక అవకాశం కల్పించాలని చంద్రబాబు నాయుడును కోరినట్లు మాదంశెట్టి నీలబాబు తెలిపారు. పార్టీ కోసం తాను చేసిన కార్యక్రమాలను గుర్తించి, తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.




