Anakapalle: అక్కిరెడ్డిపాలెంలో వయోవృద్ధులను సత్కరించిన ఎమ్మెల్యే కొణతాల

Anakapalle: అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెంలో వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ వృద్ధులను సత్కరించి, వాకింగ్ ట్రాక్ హామీ ఇచ్చారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 1 Oct 2026 6:01 PM IST
Anakapalle
X

Anakapalle: అక్కిరెడ్డిపాలెంలో వయోవృద్ధులను సత్కరించిన ఎమ్మెల్యే కొణతాల

అనకాపల్లి: అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వృద్ధుల సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆరోగ్యశాఖ DM&DHO ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై వయోవృద్ధులను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో APUFIDC చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధుల ఆరోగ్యం, సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవలను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ వివరించారు.

అనంతరం వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కొణతాల సందర్శించారు. శిబిరంలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించి, వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు.

వయోవృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన వైద్య సేవలను నిరంతరం అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. అలాగే వృద్ధులు ప్రతిరోజూ ఉదయం నడక సాగించేందుకు వీలుగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో MPDO, ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI