Anakapalle: ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు బి-ఫారాలు పంపిణీ – కొణతాల!

Anakapalle: అనకాపల్లి, కశింకోట ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు బి-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 27 Oct 2026 11:27 PM IST
Anakapalle
X

Anakapalle: ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు బి-ఫారాలు పంపిణీ – కొణతాల!

అనకాపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి, కశింకోట మండలాల్లో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి.

ఈ క్రమంలో జనసేన పార్టీ తరఫున కూటమి అభ్యర్థులుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ బి-ఫారాలను అందజేశారు.

ఈ సందర్భంగా అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన కొణతాల రామకృష్ణ, ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బి-ఫారాల అందజేతతో ఎన్నికల ప్రక్రియలో మరో కీలక అడుగు పడింది.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI