Mamidipalem: మామిడిపాలెం హైస్కూల్ వద్ద భారీ పోలీసు బందోబస్తు!
Mamidipalem: మామిడిపాలెం హైస్కూల్లో పేరెంట్స్ కమిటీ నియామకం నేపథ్యంలో ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Mamidipalem: మామిడిపాలెం హైస్కూల్ వద్ద భారీ పోలీసు బందోబస్తు!
Mamidipalem: అనకాపల్లి మండలం మామిడిపాలెం హైస్కూల్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాఠశాలలో పేరెంట్స్ కమిటీ నియామక ప్రక్రియ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అనకాపల్లి రూరల్ పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.
పేరెంట్స్ కమిటీ నియామక ప్రక్రియకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాఠశాల పరిసరాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.
అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు రూరల్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. రూరల్ సీఐ అశోక్ కుమార్, ఎస్‌ఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
పేరెంట్స్ కమిటీ నియామక ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పాఠశాల పరిసరాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.




