Anakapalle: అనకాపల్లి జనసేన ఆఫీసులో వినతుల స్వీకరణ

Anakapalle: అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులను స్వీకరించిన నియోజకవర్గ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రామ్కి.. పరిష్కారానికి హామీ.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 5 Oct 2026 4:02 PM IST
Anakapalle
X

Anakapalle: అనకాపల్లి జనసేన ఆఫీసులో వినతుల స్వీకరణ

అనకాపల్లి: అనకాపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యలపై వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రజలు, కూటమి కార్యకర్తలు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రామ్కికి అందజేశారు.

ప్రజలు, కార్యకర్తలు వివరించిన సమస్యలను రామ్కి సావధానంగా విని, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. సమస్యలను మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భీమరశెట్టి రామ్కి తెలిపారు. సమస్యలపై వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI