Anakapalle: బట్లపూడిలో బాల గణపతి వేడుకలు, అన్న సమారాధనలో రామ్కి

Anakapalle: అనకాపల్లి మండలం బట్లపూడిలో బాలా గణపతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన అన్న సమారాధనలో జనసేన ఇన్‌చార్జ్ బీమరశెట్టి రామ్కి పాల్గొని భక్తులకు వడ్డించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 6 Oct 2026 8:40 PM IST
Anakapalle
X

Anakapalle: బట్లపూడిలో బాల గణపతి వేడుకలు, అన్న సమారాధనలో రామ్కి

అనకాపల్లి: అనకాపల్లి మండలం బట్లపూడి గ్రామంలో బాల గణపతి కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోవిందరాజు అవతారంలో కొలువుదీరిన వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన భారీ అన్న సమారాధన కార్యక్రమానికి అనకాపల్లి జనసేన పార్టీ ఇన్‌చార్జ్ బీమరశెట్టి రామ్కి హాజరయ్యారు. ముందుగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో రామ్కి పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా వడ్డింపు చేస్తూ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అనంతరం కమిటీ సభ్యులు, భక్తులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, బాల గణపతి కమిటీ సభ్యులు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI