Anakapalle: 112వ వార్డుపై కూటమి ఫోకస్ - ఎస్సీ రిజర్వేషన్‌పై చర్చ
Anakapalle: అనకాపల్లి 112వ వార్డుపై కూటమి పార్టీల ప్రత్యేక దృష్టి. ఎస్సీ రిజర్వేషన్ ఖరారైతే అభ్యర్థి ఎవరనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ.
Anakapalle: 112వ వార్డుపై కూటమి ఫోకస్ - ఎస్సీ రిజర్వేషన్‌పై చర్చ
అనకాపల్లి: అనకాపల్లి జోన్–10లో వార్డుల సంఖ్య పెరగడంతో స్థానిక రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గతంలో ఐదు వార్డులు ఉన్న ఈ జోన్ ప్రస్తుతం ఆరు వార్డులకు విస్తరించింది. ఈ క్రమంలో 112వ వార్డుకు ఎస్సీ రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉందంటూ అనకాపల్లిలో ప్రచారం జోరుగా సాగుతోంది.
రిజర్వేషన్లపై అధికారిక స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ.. ఎస్సీ రిజర్వేషన్ ఖరారైతే ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై కూటమి పార్టీల్లో చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల తరఫున వివిధ సామాజిక వర్గాలకు చెందిన 100 మందికి పైగా ఆశావహులు ఇప్పటికే తమ అభ్యర్థిత్వాల కోసం పార్టీ నేతలకు దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. అయితే 112వ వార్డుకు ఎస్సీ రిజర్వేషన్ వస్తే సామాజిక సమీకరణాలకు అనుగుణంగా ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలనే అంశం కూటమి నేతలకు కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఉన్న సబ్బవరపు గణేష్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు కూటమి వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఆయన అభ్యర్థిత్వంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
మొత్తంగా 112వ వార్డుకు ఎలాంటి రిజర్వేషన్ ఖరారవుతుంది? ఎస్సీ రిజర్వేషన్ వస్తే కూటమి అభ్యర్థి ఎవరవుతారు? అన్న అంశాలు అనకాపల్లి రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




