Anakapalle: ఎన్నికలకు అనకాపల్లి జిల్లా యంత్రాంగం సిద్ధం

Anakapalle: అనకాపల్లి జిల్లాలో జీవీఎంసీ 6 వార్డులు, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపల్ ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధమైందని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 15 Oct 2026 8:22 PM IST
Anakapalle
X

Anakapalle: ఎన్నికలకు అనకాపల్లి జిల్లా యంత్రాంగం సిద్ధం

అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఎన్నికలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మీడియా సమావేశంలో వివరించారు.

జీవీఎంసీ జోన్‌-10 పరిధిలోని ఆరు వార్డుల్లో మొత్తం 76,950 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈసారి ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల ద్వారా ఓటింగ్ నిర్వహించనున్నారు. అనకాపల్లి జిల్లాలో జీవీఎంసీ పరిధిలోని ఆరు వార్డులతో పాటు నర్సీపట్నం, యలమంచిలి పురపాలక సంఘాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.

కార్పొరేటర్ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో ప్రారంభం కానుంది.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రచార కార్యక్రమాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించేందుకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI