Anakapalle: అనకాపల్లి ఏఎంసీ కాలనీ సమస్యలకు పరిష్కారం
Anakapalle: అనకాపల్లి ఏ.ఎం.సీ కాలనీలో ఎస్సీ సామాజిక భవనం, తాగునీటి పనులకు శంకుస్థాపన. స్పందించి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు ప్రజల ధన్యవాదాలు.
Anakapalle: అనకాపల్లి ఏఎంసీ కాలనీ సమస్యలకు పరిష్కారం
అనకాపల్లి: ఏ.ఎం.సీ కాలనీలో ఎస్సీ సామాజిక భవన నిర్మాణం, తాగునీటి సమస్యల పరిష్కారానికి చేపట్టిన పనులు ప్రారంభం కావడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో కాలనీలో నెలకొన్న సమస్యలపై మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఏపీయూఎఫ్ఐడీసీ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణకు కాలనీవాసులు వినతిపత్రం సమర్పించారు.
దీనిపై స్పందించిన నాయకులు జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కమిషనర్ కే. చక్రవర్తిని క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్వయంగా కాలనీని సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన ప్రారంభించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో కాలనీలో సమస్యల పరిష్కారానికి సంబంధించి పనులకు శంకుస్థాపనలు పూర్తయి, పనులు ప్రారంభం కావడంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, పీలా గోవింద సత్యనారాయణ, జోనల్ కమిషనర్ కే. చక్రవర్తి, సంబంధిత అధికారులకు ఏ.ఎం.సీ కాలనీ నివాసులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.




