Anakapalle: అనకాపల్లి జోన్-10 కూటమి అభ్యర్థుల ఎంపికపై వీడని ఉత్కంఠ!

Anakapalle: అనకాపల్లి జోన్-10 పరిధిలోని 6 వార్డుల్లో కూటమి అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే కొణతాల, పీలా గోవింద సత్యనారాయణ ఆచితూచి కసరత్తు చేస్తున్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 16 Oct 2026 9:08 PM IST
Anakapalle
X

Anakapalle: అనకాపల్లి జోన్-10 కూటమి అభ్యర్థుల ఎంపికపై వీడని ఉత్కంఠ!

అనకాపల్లి: అనకాపల్లి జోన్‌-10లోని ఆరు వార్డులకు కూటమి అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నుంచి ఇప్పటివరకు అభ్యర్థుల జాబితా వెలువడకపోవడంతో టికెట్లు ఆశిస్తున్న వారిలో టెన్షన్ నెలకొంది. మరోవైపు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు ప్రచారంలో ఉన్న ఓ జాబితా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

కూటమిలోని మూడు పార్టీల నుంచి టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై ఆశావహుల్లో అయోమయం నెలకొంది. అభ్యర్థుల బలాబలాలు, స్థానికంగా ఉన్న పరిస్థితులు, గెలుపు అవకాశాలకు సంబంధించిన అంశాలను పార్టీ నాయకత్వాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

జనసేన తరఫున అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, టీడీపీ తరఫున నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఆశావహులతో చర్చలు జరుపుతూ, అందుబాటులో ఉన్న వివరాలను పరిశీలించి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసే ప్రక్రియలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆరు వార్డుల్లో కూటమి తరఫున ఎవరికి అవకాశం దక్కుతుంది? ఏ పార్టీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారు? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికారిక జాబితా విడుదలయ్యే వరకు ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగనుంది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI