Anakapalle: అనకాపల్లి 111వ వార్డులో వైఎస్సార్‌సీపీ సుడిగాలి ప్రచారం!
Anakapalle: అనకాపల్లి 111వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం, అన్నసమారాధన కార్యక్రమం ఘనంగా సాగాయి.
Anakapalle: అనకాపల్లి 111వ వార్డులో వైఎస్సార్‌సీపీ సుడిగాలి ప్రచారం!
Anakapalle: అనకాపల్లి జోన్-10 పరిధిలోని 111వ వార్డులో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 111వ వార్డు వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ కోరుకొండ రాఘవ వార్డులో సుడిగాలి పర్యటన చేపట్టి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 110వ వార్డు ఇన్‌ఛార్జ్ జానకిరామరాజు, 112వ వార్డు ఇన్‌ఛార్జ్ జాజుల రమేష్ పాల్గొని స్థానికులతో మమేకమయ్యారు.
మరోవైపు, కోట్ని వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన భారీ అన్నసమారాధన కార్యక్రమానికి కోరుకొండ రాఘవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నసమారాధనను ప్రారంభించారు.




