Alluri: అరకు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఐడీ కార్డుల పంపిణీ!

Alluri: అల్లూరి అనంతగిరిలో వైసీపీ సమావేశం నిర్వహించి, రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుచుకోవాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు.

REHAMAN, ARAKU
Published on: 8 Oct 2026 7:52 PM IST
Alluri
X

Alluri: అరకు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఐడీ కార్డుల పంపిణీ!

Alluri: ఈ రోజు అరకు నియోజకవర్గం,అనంతగిరి మండలంలోని పెదకోట, కివర్ల,పినకోట,జినబాడు గ్రామ పంచాయతీ కేంద్రాల్లో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు కొర్ర సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలు,బూత్ కమిటీల బలోపేతం,ఐడీ కార్డుల పంపిణీపై విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి.

ముఖ్య అతిథిగా అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గారు పాల్గొని కివర్ల,పెదకోట,పిన కోట,జిన బాడు పంచాయతీల్లో పార్టీ జెండా ఆవిష్కరించి కార్యకర్తలకు ఐడీ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా రేగం మత్స్యలింగం గారు మాట్లాడుతూ...

జగనన్న పథకాలకు పేర్లు మార్చడం తప్ప కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. అమ్మఒడిని తల్లికి వందనం, రైతు భరోసాను అన్నదాత సుఖీభవ అని మార్చి లబ్ధిదారులను తగ్గించారన్నారు.మన హయాంలో 64 లక్షల మందికి అమ్మఒడి కింద రూ.15,000 ఇస్తే, వీరు 54 లక్షల మందికి రూ.13,000కే కుదించారని, వైఎస్సార్ చేయూతను ఎత్తేసి మహిళలను మోసం చేశారన్నారు.

కరోనా కష్టకాలంలో కూడా జగనన్న ప్రజలను వదల్లేదు,ఇంటింటికీ సంక్షేమాన్ని పంచాడు. మన హయాంలో అర్హులందరికీ వెంటనే పింఛన్లు ఇచ్చాం,కానీ కూటమి ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలుగా ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదు,ఇప్పుడు ఎన్నికల కోసమే ఇస్తామని మాయమాటలు చెబుతోందని,రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల కుప్పగా మార్చేశాడని ధ్వజమెత్తారు.

రూ.4000 పింఛన్ గొప్పలు చెబుతూ 70% మందికి కోత పెట్టారని, అల్లూరి జిల్లాలోనే 60 వేల మంది కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారని, మూడు సిలిండర్లు అని చెప్పి ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. రూ.500 కోట్లతో మనం కట్టిన పాడేరు మెడికల్ కాలేజీలో 100 సీట్లకు బదులు 50 సీట్లే అంటూ కూటమి చేతులెత్తేసిందన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట పేరుతో శంకుస్థాపనలు చేశారే తప్ప, నేటికీ ఒక్క రోడ్డు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు.

జగన్ గారి ఆదేశాలతో ఐడీ కార్డు ఉన్న ప్రతి కార్యకర్తకు రూ.2 లక్షల ప్రమాద బీమా, మరణిస్తే కుటుంబానికి రూ.5.50 లక్షల సాయం అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చిందని, ప్రతి పంచాయతీ నుండి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను సిద్ధం చేసి ప్రజల్లోకి వెళ్లాలన్నారు.

మరలా జగన్ గారిని సీఎం చేయాలంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు సభ్యులందరూ మనవాళ్లే గెలవాలని, ఆ విజయాన్ని జగనన్నకు బహుమతిగా ఇద్దామని పిలుపునిచ్చారు. ఒక్కో చోట ముగ్గురు పోటీ చేయవద్దని, ఒకరినే నిలబెట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు త్రీ సభ్య కమిటీ ఇవ్వదని తానే డిక్లరేషన్ చేస్తానని నాయకులు, కార్యకర్తలు అపోహలు వీడాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు టి.మితుల గారు,శెట్టి నీలవేణి గారు, మండల పరిశీలకులు సెంబి సన్యాసిరావు గారు, సర్పంచుల ఫోరమ్ మాజీ అధ్యక్షులు పి.అప్పారావు గారు, మాజీ జడ్పీటీసీ సభ్యులు డి.గంగన్న దొర గారు, మాజీ ఎంపీటీసీ సభ్యులు డి.జయవర్ధని గారు, మండల ఉపాధ్యక్షులు పాడి కృష్ణమూర్తి గారు, అంగన్వాడి విభాగం అధ్యక్షురాలు కవిత గారు గుమ్మ మాజీ సర్పంచ్ కురడ రాములమ్మ గారు పినకోట మాజీ సర్పంచ్ సిరగం గణేష్ గారు,

పెద కోట మాజీ ఎంపీటీసీ సభ్యులు సిరగం శ్రావణి గారు మాజీ సర్పంచ్ కె.రాములమ్మ గారు, గ్రామ కమిటీ ఇన్చార్జ్లు కె.అనుష్ గారు,డి.దుక్కు గారు,పుట్టబోయిన లక్ష్మణ్ గారు,సిరగం గంగు నాయుడు,సిరగం జోగారావు గారు,సలుగు గంగు నాయుడు గారు, సూపర్ ఎంపిటిసి సభ్యులు బాడం నాగేశ్వరరావు గారు,రాంసాల రామన్న దొర గారు మండల ప్రధాన కార్యదర్శి పాంగి కోటేశ్వరరావు గారు, సోషల్ మీడియా ఇంచార్జ్ సెంబి సుందర్ గారు,స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు తడబారికి జాన్ బాబు

మండల నాయకులు మధు సుదన్ గారు,పి.చందు పట్నాయక్ గారు, రాజు గారు,బి. సన్యాసిరావు గారు,బి.లచ్చన్న గారు,తమ్మయ్య గారు, రూడి లక్ష్మణ్ గారు,గుంట తిరుపతి నాయుడు యూత్ వింగ్ కన్వీనర్ కిరణ్ గారు, అనుబంధ విభాగాల నాయకులు, సీనియర్ నాయకులు,గ్రామ పంచాయతీ కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

REHAMAN, ARAKU

REHAMAN, ARAKU