Dumbriguda: డుంబ్రిగూడ పిహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన అల్లూరి జిల్లా DMHO!

Dumbriguda: డుంబ్రిగూడ పిహెచ్‌సీని అల్లూరి జిల్లా DMHO డాక్టర్ రియాజ్ బైగ్ తనిఖీ చేశారు. గర్భిణులు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచనలు.

REHAMAN, ARAKU
Published on: 13 Oct 2026 5:55 PM IST
Dumbriguda
X

Dumbriguda: డుంబ్రిగూడ పిహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన అల్లూరి జిల్లా DMHO!

డుంబ్రిగుడ: 13, అల్లూరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డుంబ్రిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డాక్టర్ రియాజ్ బైగ్ తనిఖి నిర్వహించి సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలోని వివిధ విభాగాల తనిఖీ, ఆశా కార్యకర్తల పనితీరు పై ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సూచనలు జారీ చేసారు.

మంగళవారం ఉదయం డంబ్రిగుడ పిహెచ్ సి తనిఖి నిర్వహించి, ఆసుపత్రి వచ్చే పేషంట్ల ఓపి, గర్భిణీ స్త్రీలకు పై తీసుకుంటున్న జాగ్రత్తలపై సమీక్షించారు.అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రంలోని ల్యాబొరేటరీ, ఫార్మసీ, బేబీ వెయిటింగ్ హాల్‌ను సందర్శించి, ఆయా విభాగాల్లో అందిస్తున్న సేవలను పరిశీలించి అరా తీశారు.

సంబంధిత సిబ్బందికి విధుల నిర్వహణ, రోగులకు మెరుగైన సేవలు, మందుల పంపిణి, ఆరోగ్య కేంద్రంలో అవసరమైన సౌకర్యాలను సక్రమంగా నిర్వహించడం గురించి తగిన సూచనలు చేశారు.

క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం ఆరోగ్య సూచికలను మెరుగుపరచడం గురించి పలు ముఖ్యమైన సూచనలు చేశారు

క్షేత్రస్థాయి పర్యటనలు ఆరోగ్య సేవలు గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణ, గర్భిణీ స్త్రీలందరినీ సకాలంలో నమోదు చేయించి, నిర్ణీత షెడ్యూల్ ప్రకారం యాంటీనేటల్ కేర్ (ANC) పరీక్షలు, మందులు, వైద్య పరీక్షలు జరిగేలా చూడాలి. హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి, వారికి అవసరమైన వైద్య సేవలు రిఫరల్ సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలి. ప్రసవానంతర తల్లి, శిశు సంరక్షణపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.ప్రభుత్వ టీకాల కార్యక్రమం కింద చిన్నారులు, గర్భిణీ స్త్రీలకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టీకాలు అందేలా చూడాలి.

మత , శిశు మరణాలకు దారితీసే ప్రమాద కారకాలను ముందుగానే గుర్తించి . హైరిస్క్ కేసులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన సమయంలో తగిన వైద్య కేంద్రాలకు రిఫర్ చేయాలని చూచించారు.తల్లి,శిశు ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని చూచించారు.

ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన రిజిస్టర్లు, లబ్ధిదారుల వివరాలు, క్షేత్రస్థాయి పర్యటనల సమాచారం, నెలవారీ నివేదికలను సక్రమంగా నిర్వహించాలి. సంబంధిత ఆరోగ్య కార్యక్రమాల సమాచారాన్ని నిర్ణీత గడువులో నమోదు చేసి, నివేదికలను సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో PHC డాక్టర్, హెల్త్ సూపర్వైజర్, సిబ్బంది ఏ ఎన్ ఏం స్, అశవకర్స్, తదితరులు పాల్గొన్నారు.

REHAMAN, ARAKU

REHAMAN, ARAKU