Paderu: అల్లూరి జిల్లాలో 89.94% పింఛన్ల పంపిణీ పూర్తి: కలెక్టర్

Paderu: అల్లూరి సీతారామరాజు జిల్లాలో 89.94% ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పూర్తయిందని, సాయంత్రంలోగా శతశాతం పూర్తి చేయాలని కలెక్టర్ నిశాంతి ఆదేశించారు.

SAI, PADERU
Published on: 1 Oct 2026 6:12 PM IST
Paderu
X

Paderu: అల్లూరి జిల్లాలో 89.94% పింఛన్ల పంపిణీ పూర్తి: కలెక్టర్

Paderu: జిల్లా పాడేరు లో పెన్షన్ తీసుకుంటున్న వారందరికీ ఈ రోజే విధంగా చర్యలు చేపట్టమని జిల్లా కలెక్టర్ నిశాంతి.టి గురువారం పాడేరు మండలం మొదమాంబ నగర్ కాలనీలో పర్యటించి వితంతులకు, వృద్ధ మహిళలకు, వికలాంగ మహిళలకు ఆడప. నాగమణి,సిహెచ్. రాజారత్నం, యూ. నాగమణి, పాంగి నరసమ్మ, పాంగి లక్ష్మి, పాంగి పుష్పలకు వితంతు లబ్ధిదారులకు సామాజిక భద్రతా ఎన్టిఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడి పెన్షన్ల పంపిణీ, సంక్షేమ పథకాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పెన్షన్ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లాలో ఇప్పటివరకు 30కోట్ల, 84 లక్షల, 34 వేల మందికి, ఎప్పటికి వరకు 89.94 శాతం మందికి పంపిణి జరిగిందని, సామాజిక సేవలో మాన అందరి బాధ్యతగా తీసుకోవాలన్నారు. పేద ప్రజలకు ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు. మిగిలిన పెన్షన్లను కూడా సాయంత్రాంలోగా పంపిణీ చేసి శత శాతం పూర్తి చేయ్యాలని పిడి డిఆర్డిఏ అధికారి, వారి సిబ్బందికి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాడేరు ఎంపీడీఓ శ్రీ తేజరత్నం, పీడీ డీఆర్‌డీఏ శ్రీ జి. జయకృష్ణ, తహసీల్దార్ శ్రీ బి. శ్రీనివాసరావు,డిప్యూటీ ఏం పి డి ఓ రమేష్, డిపిఏం ఫైనాన్స్ అధికారులు అప్పారావు, బీడీ తిలక్, పెన్షన్స్ డిస్ట్రిబ్యూన్ ఏ ఓ కృష్ణారావు, వీఆర్ఏ ఇతర అధికారులు పాల్గొన్నారు.

SAI, PADERU

SAI, PADERU