Alluri: అల్లూరి జిల్లాలో విద్యార్థులకు జనపద నృత్యం, రోల్ ప్లే పోటీలు!

Alluri: అల్లూరి జిల్లా విద్యార్థులకు జనపద నృత్యం, రోల్ ప్లే పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తిగల వారు అక్టోబర్ 10లోగా పేర్లు నమోదు చేసుకోవాలి.

SAI, PADERU
Published on: 8 Oct 2026 1:32 PM IST
Alluri
X

Alluri: అల్లూరి జిల్లాలో విద్యార్థులకు జనపద నృత్యం, రోల్ ప్లే పోటీలు!

Alluri: జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్), భీమునిపట్నం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు జనపద నృత్యం, రోల్ ప్లే పోటీలు నిర్వహించనున్నట్లు అల్లూరి జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. భానుమూర్తిరాజు, డైట్ ప్రిన్సిపల్ ఎల్. సుధాకర్ తెలిపారు. ఈ మేరకు వారు పత్రికా ప్రకటన విడుదల చేశారు.

జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, కేజీబీవీ పాఠశాలల విద్యార్థులు అక్టోబర్ 10వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారు కోరారు.

పాఠశాల స్థాయి రిజిస్ట్రేషన్‌ను https://npepnc-ert.in/competition/nodal_registration.php లింక్ ద్వారా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పాఠశాలలో సంబంధిత ప్రధానోపాధ్యాయుడు లేదా ప్రిన్సిపాల్‌ను నోడల్ అధికారిగా నియమించి, ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.

మండల స్థాయిలో నిర్వహించే ఎంపిక పోటీల్లో జనపద నృత్యం, రోల్ ప్లే విభాగాల్లో ఒక్కొక్క టీమ్‌ను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన టీమ్‌లు తదుపరి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

మండల స్థాయి పోటీలు అక్టోబర్ 23న, జిల్లా స్థాయి పోటీలు అక్టోబర్ 29న నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి పోటీలు నిర్వహించే వేదిక వివరాలను తదుపరి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు. పోటీలకు హాజరయ్యే విద్యార్థులు తమకు అవసరమైన కాస్ట్యూమ్స్, మేకప్ కిట్లను స్వయంగా తీసుకురావాలని సూచించారు.

పోటీల్లో పాల్గొనే విద్యార్థుల వివరాలుజనపద నృత్యం: 8, 9వ తరగతి విద్యార్థులు 4 నుంచి 6 మంది వరకు పాల్గొనవచ్చు.

రోల్ ప్లే: 9వ తరగతి విద్యార్థులు 4 నుంచి 5 మంది వరకు పాల్గొనవచ్చు. రెండు విభాగాల్లోనూ ప్రతి టీమ్‌కు గరిష్ఠంగా 6 నిమిషాల సమయం కేటాయించారు. పోటీలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం జిల్లా నోడల్ అధికారిని సంప్రదించాలని కోరారు.

SAI, PADERU

SAI, PADERU