Paderu: కలెక్టరేట్లో రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీఆర్వో
Paderu: పాడేరు కలెక్టరేట్లో ఏసీబీ అధికారుల సంచలన దాడి. జూనియర్ అసిస్టెంట్ బకాయి బిల్లుల కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డీఆర్వో లోకేశ్వరరావు.
Paderu: కలెక్టరేట్లో రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీఆర్వో
పాడేరు: అల్లూరు జిల్లా పాడేరులో జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కనే జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయంలో యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటు ఏసీబీ అధికారులకు పట్టుబడినా జిల్లా రెవెన్యూ అధికారి
తన ఆఫీస్ లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ బకాయి బిల్స్ నిమిత్తము ప్రజరీకి సమర్పించవలసిన ఫైల్ నిమిత్తము 50వేల రూపాయలు లంచముగా ఇవ్వాలని లోకేశ్వర్ రావు డిమాండ్ చేయడంతో తన దగ్గరే పనిచేస్తున్నానని ప్రాధేయపడిన వినలేదని దీంతో ఈనెల 21న ఏసీబీ అధికారులను ఆశ్రయించి న్యాయం చేయమని కోరగా నేడు కలెక్టర్ కార్యాలయంలో మాటు వేసి ఏసీబీ అధికారులు జూనియర్ అసిస్టెంట్ వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడిన జిల్లా రెవెన్యూ అధికారి MVV లోకేశ్వరరావు.
దీంతో అనునిత్యం జిల్లా కలెక్టర్ తో ఉంటూ అనేక పనులు పర్యవేక్షణ చేస్తున్న లోకేశ్వరరావు ఏసీబీకి పట్టుపడ్డంతో పాడేరు జిల్లా కలెక్టర్ ఆఫీసులో కలకలం రేపింది. పాడేరు జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఏసీబీ దాడులు జరగడం విశేషం. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది.
అధికారులు ఎవరైనా ఎంతటి వారైనా లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం అడిగితే తమను సంప్రదించాలని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. పట్టుబడిన జిల్లా రెవెన్యూ అధికారిని అదుపులోకి తీసుకొని విచారణ చేసి కేసు నమోదు చేస్తున్నట్లు ఏసీబీ డిఎస్పి రమణమూర్తి మీడియాకు తెలిపారు. ఈ దాడుల్లో విశాఖపట్నం ఏసీబీ ఏ ఎస్ పి హరిత డి.ఎస్.పి రమణ మూర్తుల బృందం పాల్గొన్నారు.




