Alluri District: 'స్టార్ ఆఫీసర్ ఆఫ్ ది వీక్'గా డాక్టర్ ప్రతాప్

Alluri District: అల్లూరి జిల్లాలో జీరో ఎంఎంఆర్, సంజీవని పైలట్ ప్రాజెక్ట్‌లో విశేష సేవలందించిన డాక్టర్ ప్రతాప్‌కు 'స్టార్ ఆఫీసర్ ఆఫ్ ది వీక్' గౌరవం.

SAI, PADERU
Published on: 18 Sept 2026 5:27 PM IST
Alluri District
X

Alluri District: 'స్టార్ ఆఫీసర్ ఆఫ్ ది వీక్'గా డాక్టర్ ప్రతాప్

అల్లూరి సీతారామరాజు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాతృ మరణాల నివారణ లక్ష్యంగా అమలు చేస్తున్న ‘జీరో ఎంఎంఆర్’ కార్యక్రమంలో డాక్టర్ ప్రతాప్, ప్రోగ్రామ్ ఆఫీసర్, NCD & RBKS, కృషి చేశారు.

గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడం, అధిక ప్రమాద గర్భిణులను గుర్తించడం, అవసరమైన వైద్య సేవలకు సకాలంలో సమన్వయం చేయడం వంటి కార్యక్రమాల్లో ఆయన బాధ్యతలు నిర్వహించారు.

అదేవిధంగా, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సుంకరమెట్టలో సంజీవని పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందితో సమన్వయం చేస్తూ డాక్టర్ ప్రతాప్ తన విధులను నిర్వహించారు.

ఆరోగ్య కార్యక్రమాల అమలు, సమన్వయంలో ఆయన నిర్వహించిన బాధ్యతలను గుర్తిస్తూ జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిశాంతి, ఐఏఎస్, డాక్టర్ ప్రతాప్‌ను ఈ వారానికి *‘స్టార్ ఆఫీసర్ ఆఫ్ ది వీక్’*గా ఎంపిక చేసి, శాలువా కప్పి సత్కరించి, మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది డాక్టర్ ప్రతాప్‌ను అభినందించారు.

SAI, PADERU

SAI, PADERU