Paderu: అల్లూరి జిల్లా వంజంగి కొండల్లో మేఘాల ఊరేగింపు - పర్యాటక సందడి!
Paderu: అల్లూరి జిల్లా పాడేరు సమీపంలోని వంజంగి కొండల్లో భానుడి వెలుగులు, మేఘాల ఊరేగింపు. పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న ప్రకృతి అందాలు.
Paderu: అల్లూరి జిల్లా వంజంగి కొండల్లో మేఘాల ఊరేగింపు - పర్యాటక సందడి!
Paderu: అల్లూరి జిల్లాలో ఆవిష్కృతమైంది, పాడేరు మండలం వంజంగి కొండల్లో భానుడి వెలుగులు కొత్త రంగులు అద్దుకున్నాయి. మేఘాలు తేలియాడే కొండలు, సూర్యోదయం. సముద్ర మట్టానికి 3400 అడుగుల ఎత్తులో దట్టమైన మంచు కురిసే కొండల మధ్య పాల సముద్రం పొంగిపొర్లుతోందా అన్నట్లుగా మేఘాల ఊరేగింపు పర్యాటకులను కట్టిపడేస్తోంది!
పచ్చటి కొండల నడుమ తేలియాడే తెల్లటి మేఘమాలికలు చూస్తుంటే ఆకాశమే నేలకు దిగివచ్చిందా అనిపిస్తోంది.
ఉదయాన్నే వెలుగులు విరజిమ్మే సూర్యోదయ వేళ ఆ ఎర్రటి కిరణాలు మంచు తెరలను తాకుతుంటే సరికొత్త కాంతులు చిందుతున్నాయి.
ఈ అద్భుతమైన నయన మనోహర దృశ్యాన్ని తిలకించడానికి పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు వంజంగికి క్యూ కట్టారు. కిలకిలారావాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవిస్తూ ఈ అందాలను తమ కెమెరాల్లో బంధిస్తూ ప్రకృతి ప్రేమికులు మురిసిపోతున్నారు.




