Hukumpeta: వినాయక చవితి వేడుకల్లో ఘనంగా అన్నదాన కార్యక్రమం

Hukumpeta: హుకుంపేట మండలం దాలిగుమ్మడిలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు. గ్రామస్తుల కోసం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేతలు.

SAI, PADERU
Published on: 18 Sept 2026 6:49 PM IST
Hukumpeta
X

Hukumpeta: వినాయక చవితి వేడుకల్లో ఘనంగా అన్నదాన కార్యక్రమం

హుకుంపేట: వినాయక చవితి వేడుకల్లో అన్నదాన సేవ హుకుంపేట మండలం దాలిగుమ్మడి గ్రామంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడి ఆశీస్సులతో గ్రామ ప్రజల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు.

ఈ అన్నదాన కార్యక్రమంలో హుకుంపేట మండల వైసీపీ అధ్యక్షుడు పాంగి అనిల్, హుకుంపేట పంచాయతీ మాజీ సర్పంచ్ సమిడా వెంకట పూర్ణిమ, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ మహిళలు పాల్గొని భక్తులకు, గ్రామస్థులకు అన్నప్రసాదాన్ని అందించారు.

అన్నదానం మహాదానం అనే భావనతో నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామంలోఉన్న ప్రజలు పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడి కృప ప్రతి ఒక్కరి కుటుంబంపై ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వైసిపి మండల నాయకులు అనిల్ హుకుంపేట సర్పంచ్ పూర్ణిమ ఆకాంక్షించారు.

SAI, PADERU

SAI, PADERU