Paderu: పాఠశాలల సెలవుపై అల్లూరి జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన!

Paderu: భారీ వర్షాలు, తుఫాన్ హెచ్చరికలతో అక్టోబర్ 29న అల్లూరి జిల్లాలోని పాఠశాలలకు కలెక్టర్ నిషాంతి సెలవు ప్రకటించారు. ఇది డే స్కాలర్లకే వర్తిస్తుంది.

SAI, PADERU
Published on: 28 Oct 2026 6:59 PM IST
Paderu
X

Paderu: పాఠశాలల సెలవుపై అల్లూరి జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన!

Paderu: భారీ వర్షాలు, తుఫాను హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా 2026 అక్టోబర్ 29వ తేదీన కూడా డే స్కాలర్ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు అల్లూరి జిల్లా కలెక్టర్ శ్రీమతి నిషాంతి టి., ఐ.ఏ.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సెలవుకు పరిహారంగా డిసెంబర్ 2026, జనవరి 2027, ఫిబ్రవరి 2027 నెలల్లో రానున్న రెండో శనివారాల్లో పాఠశాలలు పనిచేస్తాయని కలెక్టర్ వెల్లడించారు. అయితే, ఈ సెలవు డే స్కాలర్ విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందని, రెసిడెన్షియల్ పాఠశాలలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి, సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు సూచించిన మార్గదర్శకాలను పాటించాలని కలెక్టర్ కోరారు.

SAI, PADERU

SAI, PADERU