Ananthagiri: పినకోట దుర్ఘటనపై అల్లూరి జిల్లా కలెక్టర్ టి. నిశాంతి తీవ్ర దిగ్భ్రాంతి!

Ananthagiri: అనంతగిరి పినకోట పేలుడు దుర్ఘటనపై అల్లూరి జిల్లా కలెక్టర్ టి. నిశాంతి దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, బీమా సాయం ప్రకటన.

SAI, PADERU
Published on: 24 Oct 2026 6:29 PM IST
Ananthagiri
X

Ananthagiri: పినకోట దుర్ఘటనపై అల్లూరి జిల్లా కలెక్టర్ టి. నిశాంతి తీవ్ర దిగ్భ్రాంతి!

Ananthagiri: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధిలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం అత్యంత విషాదకరమని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిశాంతి తెలిపారు.

పినకోట పంచాయతీ పరిధిలోని పీచుమామిడి గ్రామ సమీపంలో రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో సంభవించిన ప్రమాదంలో ఒక ఉపాధ్యాయురాలితో పాటు వాహన డ్రైవర్, కార్మికులు కలిపి మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు.

ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు జిల్లా కలెక్టర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురి కుటుంబాలకు కాంట్రాక్టర్ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

దీనితో పాటు సంబంధిత నిబంధనల ప్రకారం బీమా సాయం కూడా అందేలా అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

మృతుల కుటుంబాలకు అండగా నిలిచి, వారికి తగిన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిశాంతి తెలిపారు.

SAI, PADERU

SAI, PADERU