Anakapalli: కూటమి ఐక్యతే లక్ష్యం స్థానిక ఎన్నికల్లో సమష్టి పోరుకు పిలుపు!

Anakapalli: అనకాపల్లి సత్యా గ్రాండ్‌లో నిర్వహించిన కూటమి ఆత్మీయ సమావేశంలో స్థానిక ఎన్నికల్లో సమష్టిగా పోరాడి ఘనవిజయం సాధించాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 27 Sept 2026 5:25 PM IST
Anakapalli
X

Anakapalli: కూటమి ఐక్యతే లక్ష్యం స్థానిక ఎన్నికల్లో సమష్టి పోరుకు పిలుపు!

Anakapalli: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అనకాపల్లి గవరపాలెంలోని సత్యా గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో కూటమి కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కూటమి పార్టీలకు సుమారు 65 శాతం ఓట్లు నమోదయ్యాయని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఓట్ల శాతాన్ని 80 శాతానికి పెంచేలా కూటమి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

స్థానిక ఎన్నికల్లో సీటు ఎవరికి వచ్చినా మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్క ఓటు కీలకమని, కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జనసేన పార్టీ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రామ్కీతో పాటు ఎమ్మెల్యే ఇన్‌చార్జులు, అబ్జర్వర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI