Araku: అరకు, పాడేరులలో కొనసాగుతున్న కూటమి సీట్ల సర్దుబాటు పీటముడి!
Araku: అరకు పార్లమెంట్, పాడేరు అసెంబ్లీ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల సర్దుబాటుపై కూటమి చర్చలు అసంపూర్తిగా ముగిసాయి.
Araku: అరకు, పాడేరులలో కొనసాగుతున్న కూటమి సీట్ల సర్దుబాటు పీటముడి!
Araku: స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల సర్దుబాటుపై తొలిరోజు అరకు పార్లమెంటు, పాడేరు అసెంబ్లీ కూటమి 3 పార్టీల సమావేశంలో చర్చలు సంపూర్ణం కాలేదు. ఈరోజు ఉదయం 10 గంటలకు మరో దఫా దీనిపై చర్చలు జరపనున్నారు. ఆ చర్చలు అనంతరం నిర్ణయం తీసుకుందాం.
చర్చలు సఫలీకృతం అయితే మంచి ఫలితాలు సాధించేందుకు ప్రయత్నం చేద్దాం. చర్చలు ప్రతికూలంగా ఉంటే పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్దాం. ఈ నేపథ్యంలో అరకు పార్లమెంటు సమన్వయ కమిటీ , పాడేరు నియోజకవర్గ సమన్వయ కమిటీల సభ్యులు ఈరోజు అనగా గురువారం ఉదయం 11 గంటలకు జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గం కార్యాలయంలో అత్యవసర సమావేశానికి హాజరు కావలసిందిగా కోరుచున్నాము.
డాక్టర్ వంపూరు గంగులయ్య జనసేన పార్టీ అరకు పార్లమెంటు సమన్వయకర్త , పాడే అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి, ఆంధ్రప్రదేశ్ జానపద కళలు& సృజనాత్మకత అకాడమీ చైర్మన్.




