Anakapalle: అనకాపల్లి 110వ వార్డులో కూటమి అభ్యర్థి తాడి శాంతి కుమారి జోరుగా ప్రచారం!

Anakapalle: అనకాపల్లి జీవీఎంసీ 110వ వార్డు కూటమి అభ్యర్థి తాడి శాంతి కుమారి ప్రచారం. మెజారిటీ సాధించిన వార్డుకు రూ. 2 కోట్ల అదనపు నిధులు, కాశీ-అయోధ్య యాత్ర ఆఫర్ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 29 Oct 2026 1:01 PM IST
Anakapalle
X

Anakapalle: అనకాపల్లి 110వ వార్డులో కూటమి అభ్యర్థి తాడి శాంతి కుమారి జోరుగా ప్రచారం!

Anakapalle: అనకాపల్లి జీవీఎంసీ 110వ వార్డులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కూటమి అభ్యర్థి తాడి శాంతి కుమారి తనదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అభ్యర్థితో పాటు కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.

మరోవైపు.. వార్డుల్లో అత్యధిక మెజారిటీ సాధించే లక్ష్యంతో కూటమి నేతలు ప్రకటించిన హామీలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కీలక హామీ ఇచ్చారు. ఆరు వార్డుల్లో ఏ వార్డుకు అత్యధిక మెజారిటీ వస్తే.. ఆ వార్డు అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధులకు అదనంగా రెండు కోట్ల రూపాయలు తీసుకొస్తానని ప్రకటించారు.

అంతేకాకుండా, ఏ బూత్‌లో అత్యధిక మెజారిటీ వస్తే.. ఆ బూత్ పరిధిలో అభివృద్ధి పనుల కోసం 20 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇక అనకాపల్లి ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ సైతం మరో హామీ ఇచ్చారు. అత్యధిక మెజారిటీ సాధించిన వార్డుకు చెందిన ప్రజలను కాశీ, అయోధ్య పుణ్యక్షేత్రాల యాత్రకు తీసుకెళ్తామని ప్రకటించారు.

ఈ హామీల నేపథ్యంలో 110వ వార్డుతో పాటు ఇతర వార్డుల్లోనూ మెజారిటీ సాధించడమే లక్ష్యంగా అభ్యర్థులు, కూటమి నాయకులు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారం, ఓటర్లతో ప్రత్యక్ష సమావేశాలు, స్థానిక సమస్యలపై చర్చలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

మొత్తంగా.. అనకాపల్లి జీవీఎంసీ వార్డుల్లో ఎన్నికల ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. అభివృద్ధి హామీలు, మెజారిటీ లక్ష్యాలు, నాయకుల ప్రచార వ్యూహాలతో స్థానిక రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI