Narsipatnam: నర్సీపట్నంలో హోరెత్తుతున్న కూటమి ఎన్నికల ప్రచారం
Narsipatnam: నర్సీపట్నం మున్సిపాలిటీ కూటమి చైర్పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి ప్రచారం హోరెత్తుతుండగా, రూ.267 కోట్లతో పట్టణాన్ని అభివృద్ధి చేశామని ఎంపీ విజయ్ తెలిపారు.
Narsipatnam: నర్సీపట్నంలో హోరెత్తుతున్న కూటమి ఎన్నికల ప్రచారం
నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీలో కూటమి చైర్పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటికే ఆమె 36 వార్డుల్లో విస్తృత పర్యటన పూర్తి చేసుకున్నారు. వెళ్లిన ప్రతి వార్డులోనూ ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. మహిళలు, యువత స్వచ్ఛందంగా తరలివచ్చి హారతులు పడుతూ, పూలవర్షం కురిపిస్తున్నారు. 'పద్మమ్మకు జై' అంటూ నినాదాలు చేస్తూ ప్రచారంలో మమేకం కావడం ఆమె ఘన విజయానికి శుభసూచకంగా కనిపిస్తోంది.
ఆదివారం 31, 32, 33వ వార్డుల పరిధిలోని వెంకీనాయుడుపేట, శారదానగర్, బొంతు వీధి, పాత బస్టాండ్ సెంటర్లలో సాయంత్రం వేల కౌన్సిలర్ అభ్యర్థులు పేదిరెడ్ల చింటూ, జలుమూరి రాజ్ కుమార్, ధనిమిరెడ్డి మధు, నేరెళ్ల సీతాచంద్రిక, లతో కలిసి పద్మావతి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క వార్డూ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే రూ. 267 కోట్ల 70 లక్షలతో నర్సీపట్నం మున్సిపాలిటీని అభివృద్ధి చేశామన్నారు.
31, 32వ వార్డులకు రూ. 1.57 కోట్లు, 33వ వార్డుకు రూ. 1.61 కోట్లతో డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మించామని తెలిపారు. ముఖ్యంగా వెంకీనాయుడుపేటలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందన్న విషయం తన దృష్టికి వచ్చిందని, దానిని తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
చైర్పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి మాట్లాడుతూ.. ఏ వార్డుకు వెళ్లినా ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తున్నారని తెలిపారు. నర్సీపట్నం ప్రజలంతా ఏకతాటిపై నిలిచి సైకిల్‌కే జై కొడుతున్నారన్నారు. తమ పర్యటన ఎన్నికల ప్రచారంలా కాకుండా గెలుపు ఉత్సవాల్లా ప్రజలు ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సీనియర్ నాయకులు, యువత, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




