Anakapalli: విజయరామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద తీవ్ర ఇబ్బందులు!

Anakapalli: అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వాహనదారులు పడుతున్న ఇబ్బట్లపై రైల్వే శాఖకు ఆప్ కన్వీనర్ కొణతాల హరినాథ్ బాబు వినతిపత్రం అందజేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 30 Sept 2026 4:05 PM IST
Anakapalli
X

Anakapalli: విజయరామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద తీవ్ర ఇబ్బందులు!

Anakapalli: విజయరామరాజుపేట వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ అనకాపల్లి జిల్లా కన్వీనర్ కొణతాల హరినాథ్ బాబు పేర్కొన్నారు.

రైళ్లు అండర్ బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న సమయంలో ప్రయాణికులు మలమూత్ర విసర్జన చేయడంతో.. అవి బ్రిడ్జి కింద నుంచి వెళ్లే వాహనదారులపై పడుతున్నాయని తెలిపారు. దీంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల కారణంగా వాహనదారులు బ్రిడ్జి కింద నుంచి వెళ్లకుండా అక్కడే ఆగిపోతుండటంతో ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడుతోందని తెలిపారు.

సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా రైల్వే శాఖ అధికారులు వెంటనే స్పందించి, అండర్ బ్రిడ్జి వద్ద తగిన రక్షణ ఏర్పాట్లు, మరమ్మతులు చేపట్టాలని కొణతాల హరినాథ్ బాబు కోరారు.

ఈ మేరకు అనకాపల్లి రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ కాళ్ల రామకృష్ణకు వినతిపత్రం అందజేసి, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI