Gajuwaka: గాజువాకలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు!
Gajuwaka: గాజువాక శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శనివారం ప్రారంభించి, విద్యార్థులు పుస్తక పఠనం అలవర్చుకోవాలని సూచించారు.
Gajuwaka: గాజువాకలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు!
Gajuwaka: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను గాజువాక శాఖా గ్రంథాలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భారత మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
గ్రంధాలయం ఇంచార్జి సూర్యకళ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ...జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. విద్యార్థులందరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని, క్రమం తప్పకుండా గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదవడం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
పుస్తక పఠనం విద్యార్థుల జీవితంలో ఒక భాగం కావాలని సూచించారు. విద్యార్థులు సెల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని తెలిపారు. భావితరానికి విద్యార్థులే దేశానికి విలువైన సంపద అని, ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో స్థానిక అవార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, 100 వ వార్డు కార్పొరేటర్ నల్లూరు సూర్యనారాయణ, గాజువాక శాంతిభద్రతల సిఐ వాసు నాయుడు, ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై డైరెక్టర్ ప్రసాద్‌ల శ్రీనివాస్, గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త పల్లా రమణ, గ్రంథాలయం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




