Anakapalli: ఎన్టీఆర్ ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ సేవలు ప్రారంభం!

Anakapalli: రూ.23 కోట్లతో నిర్మించిన అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి. తొలిదశలో క్యాజువాల్టీ, ఐసీయూ సేవలు ప్రారంభం.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 21 Sept 2026 2:47 PM IST
Anakapalli
X

Anakapalli: ఎన్టీఆర్ ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ సేవలు ప్రారంభం!

Anakapalli: అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా సుమారు రూ.23 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆసుపత్రిలో వైద్య సేవలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌లో తొలిదశలో క్యాజువాల్టీ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ నెల 17న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా భవనం ప్రారంభోత్సవం జరిగిందని, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆధ్వర్యంలో అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం క్యాజువాల్టీతో పాటు ఎమర్జెన్సీ, ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయని, సుమారు 10 ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కేంద్రం నుంచి అవసరమైన వైద్య పరికరాలు అందిన అనంతరం పూర్తి స్థాయిలో 50 పడకల క్రిటికల్ కేర్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

అనకాపల్లి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అత్యవసర వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా క్రిటికల్ కేర్ బ్లాక్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో ఆక్సిజన్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

జిల్లా ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో ఈ క్రిటికల్ కేర్ ఆసుపత్రి కీలకంగా నిలుస్తుందని కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI