Visakhapatnam: 101 కొబ్బరికాయలతో నూకాంబిక అమ్మవారికి మొక్కు

Visakhapatnam: జీవీఎంసీ 90వ వార్డులో మహమ్మద్ రఫీ ఘనవిజయంతో ఇందిరా కాలనీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో తాడి వరలక్ష్మి ఆధ్వర్యంలో 101 కొబ్బరికాయల మొక్కు చెల్లించారు.

PRAKASH, GAJUWAKA
Published on: 11 Nov 2026 5:42 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: 101 కొబ్బరికాయలతో నూకాంబిక అమ్మవారికి మొక్కు

Visakhapatnam: జీవీఎంసీ 90వ వార్డు ఎన్నికల్లో మహమ్మద్ రఫీ ఘనవిజయం సాధించడంతో, గతంలో మొక్కుకున్న మొక్కును తాడి వరలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు భక్తిశ్రద్ధలతో నెరవేర్చుకున్నారు.

ఎన్నికల సందర్భంగా మహమ్మద్ రఫీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ తాడి వరలక్ష్మి గారు, పలువురు మహిళలు ఇందిరా కాలనీలోని శ్రీ శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆయన విజయం సాధిస్తే 101 కొబ్బరికాయలతో అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటామని మొక్కుకున్నారు.

ఈ నేపథ్యంలో మహమ్మద్ రఫీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో, నవంబర్ 11వ తేదీ బుధవారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలతో అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నారు.

ఈ కార్యక్రమంలో తాడి వరలక్ష్మి, మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహమ్మద్ రఫీ అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, వార్డు అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో

విశాఖ జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాంబాబు,స్వర్ణ పూడి సత్యనారాయణ,ఆన్సర్ వల్లి, ఐ జగదీశ్,సత్య, త్రినాధ్, ఆవల శివ,బొట్ట కార్తిక్,సురేష్,పెద్ద మోతి,వెంకట్ రెడ్డి,కూటమి పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA