Vijayawada: ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా యలమంచిలి కిషోర్ బాబు వ్యాఖ్యలు!

Vijayawada: ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ సేవారత్న పురస్కార గ్రహీత యలమంచిలి కిషోర్ బాబు ప్రెస్ మీట్. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సేవలు కొనియాడత.

Ramana, Penamaluru
Published on: 9 Oct 2026 12:12 PM IST
Vijayawada
X

Vijayawada: ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా యలమంచిలి కిషోర్ బాబు వ్యాఖ్యలు!

Vijayawada: ప్రతి స్టాంపు వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి ఉత్తరం వెనుక ఎన్నో ఆశలు... ఎదురుచూపులు ఉంటాయి... కాలం మారినా, సాంకేతికత అభివృద్ధి చెందినా, తపాలా అనే సాధారణమైన, చిరకాల బంధం మన మధ్య దూరాలను అధిగమించి మన హృదయాలను కలుపుతూనే ఉందని ఎన్టీఆర్ సేవారత్న పురస్కార గ్రహీత యలమంచిలి కిషోర్ బాబు అన్నారు.

నేడు ప్రపంచ తపాలా దినోత్సవం నేపధ్యంలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, కేంద్ర తపాలాశాఖ మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనందరి జీవితాలతో పెనవేసుకున్న తపాలాశాఖ మానవీయ స్పర్శను కాపాడుతూనే, తపాలా నెట్‌వర్క్‌ను విస్తృత అవకాశాలు, సమ్మిళిత అభివృద్ధి, పురోగతికి శక్తివంతమైన ఇంజిన్‌గా మార్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

ఈ సందర్భంగా కంకిపాడు పోస్ట్ మ్యాన్ వీరు నాయక్‌ను దుశ్శాలువతో సన్మానించారు.

తపాలాశాఖ అందిస్తున్న ఇండియా పోస్ట్ ఆఫీస్ పేమెంట్స్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి సేవలను స్వల్ప ఖర్చుతోనే, వ్యయ ప్రయాసలకు లోను కాకుండా అత్యుత్తమ సేవలను ప్రతీ ఒక్కరూ అందిపుచ్చుకోవాలని పిలుపిచ్చారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru