Rayalaseema: రాయలసీమకు నీళ్లొస్తుంటే వైసీపీకి ఉలికిపాటు: ఎం.ఎస్. బేగ్

Rayalaseema: రాయలసీమకు సాగునీరు అందిస్తుంటే వైసీపీ ఎందుకు ఓర్వలేకపోతోందని టీడీపీ అధికార ప్రతినిధి ఎం.ఎస్. బేగ్ ప్రశ్నించారు; చంద్రబాబు వాటర్ మ్యాన్ అని కొనియాడారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 4 Oct 2026 9:13 PM IST
Rayalaseema
X

Rayalaseema: రాయలసీమకు నీళ్లొస్తుంటే వైసీపీకి ఉలికిపాటు: ఎం.ఎస్. బేగ్

Rayalaseema: రాయలసీమ రైతుల దశాబ్దాల సాగునీటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేస్తుంటే వైసీపీ నేతలు అనవసర ఆరోపణలు చేయడం దురదృష్టకరమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ అన్నారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశారు ? ఎన్ని ప్రాజెక్టులను పూర్తి చేశారు ? పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఏం చర్యలు తీసుకున్నారు ? అనే విషయాలను జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కూటమి ప్రభుత్వం రాబోయే మూడేళ్లలో 36 ప్రాధాన్యతా సాగునీటి ప్రాజెక్టులను సుమారు రూ.35,000 కోట్లతో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

హంద్రీ–నీవా, వెలిగొండ, పోలవరం తదితర కీలక ప్రాజెక్టులను వేగవంతం చేస్తూ రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

రాయలసీమను కేవలం కరువు ప్రాంతంగా కాకుండా దేశంలోనే ప్రముఖ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసి, సాగునీటితో పాటు ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతుల ద్వారా రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని అని ఎం.ఎస్. బేగ్ తెలిపారు.

రైతులకు కావాల్సింది రాజకీయ ఆరోపణలు కాదు, సాగునీరు కావాలి, రాయలసీమకు కావాల్సింది అడ్డంకులు కాదు — ప్రాజెక్టుల పూర్తిచేయడం, రాయలసీమకు నీళ్లు తెచ్చే ప్రభుత్వానికి అండగా నిలవాలి, నీటి ప్రాజెక్టులను అడ్డుకునే రాజకీయాలకు ప్రజలు చెక్ పెడతారని ఎం.ఎస్. బేగ్ అన్నారు.

రాయలసీమకు నీళ్లు తెచ్చేది - వాటర్ మ్యాన్ నారా చంద్రబాబు నాయుడు,

అడ్డుకునేది - గొడ్డలి మ్యాన్ జగన్ రెడ్డి.

వాటర్ మ్యాన్ కావాలో, గొడ్డలి మ్యాన్ కావాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని ఎం.ఎస్. బేగ్ స్పష్టం చేశారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.