Indrakeeladri: ఇంద్రకీలాద్రి గో సంరక్షణకు ₹2 లక్షల విరాళం
Indrakeeladri: ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం గో సంరక్షణ పథకానికి విశాఖకు చెందిన సతీష్ కుమార్, అనిత దంపతులు ₹2,00,000 విరాళం అందజేశారు.
Indrakeeladri: ఇంద్రకీలాద్రి గో సంరక్షణకు ₹2 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి విశాఖపట్నానికి చెందిన భక్తులు సతీష్ కుమార్ నారాయణశెట్టి, అనిత నారాయణశెట్టి దంపతులు ₹2,00,000 (రెండు లక్షల రూపాయలు) విరాళాన్ని అందజేశారు.
ఈ విరాళాన్ని దేవస్థానం నిర్వహించే గో సంరక్షణ పథకానికి కేటాయించారు. గురువారం ఆలయ అధికారుల సమక్షంలో ఈ విరాళానికి సంబంధించిన ‘దేవస్థానం బాండ్’ను దాతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కిషోర్ కుమార్ మరియు ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు.




