Vijayawada: విజయవాడ ఉత్సవ్–2.0: పీవీపీ మాల్‌లో ఫ్లాష్‌మాబ్ సందడి

Vijayawada: విజయవాడ ఉత్సవ్–2.0 ప్రచారంలో భాగంగా పీవీపీ మాల్‌లో నిర్వహించిన ఫ్లాష్‌మాబ్ విశేషంగా ఆకట్టుకుంది; సంస్కృతిని చాటేందుకు యువత భాగస్వామ్యం కావాలని నేతలు పిలుపునిచ్చారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 4 Oct 2026 9:05 PM IST
Vijayawada
X

Vijayawada: విజయవాడ ఉత్సవ్–2.0: పీవీపీ మాల్‌లో ఫ్లాష్‌మాబ్ సందడి

విజయవాడ(పీవీపీ మాల్): విజయవాడ ఉత్సవ్–2.0కు విస్తృత ప్రచారం కల్పించేందుకు నిర్వహిస్తున్న ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నగర యువత ఉత్సాహంగా పాల్గొంటోంది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పీవీపీ మాల్‌లో నిర్వహించిన ఫ్లాష్‌మాబ్ కార్యక్రమం సందడి వాతావరణాన్ని నెలకొల్పింది. యువత చేసిన ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా అలరించాయి.

విజయవాడ సంస్కృతి, కళలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో విజయవాడ ఉత్సవ్–2.0ను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్సవ్‌లో యువతను భాగస్వాములను చేయడంతో పాటు, నగర ప్రజల్లో ఉత్సవ్‌పై మరింత ఆసక్తి, ఉత్సాహాన్ని పెంచేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వినూత్న ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఫ్లాష్‌మాబ్ సందర్భంగా యువత ప్రదర్శించిన నృత్యాలు పీవీపీ మాల్‌కు వచ్చిన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. యువతతో పాటు చిన్నారులు, కుటుంబ సభ్యులు సైతం ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. ఫ్లాష్‌మాబ్ ద్వారా విజయవాడ ఉత్సవ్–2.0 ప్రత్యేకతలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రతి ఒక్కరూ ఉత్సవ్‌లో భాగస్వాములు కావాలనే సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు బొప్పన భవ కుమార్ పాల్గొని యువత ఉత్సాహాన్ని అభినందించారు. విజయవాడ ఉత్సవ్‌ను విజయవంతం చేయడంలో యువత కీలక పాత్ర పోషించాలని, నగర సంస్కృతి, కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

విజయవాడ ఉత్సవ్–2.0ను ప్రజలందరి ఉత్సవంగా నిర్వహిస్తున్నామని, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ కరీముల్లా, సంజయ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.