Vijayawada: విజయవాడ ఉత్సవ్ 2.0: మంత్రులకు ఎంపీ చిన్ని ఆహ్వానం

Vijayawada: కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలకు హాజరు కావాలని రాష్ట్ర మంత్రులను ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) స్వయంగా ఆహ్వానించారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 7 Oct 2026 8:28 PM IST
Vijayawada
X

Vijayawada: విజయవాడ ఉత్సవ్ 2.0: మంత్రులకు ఎంపీ చిన్ని ఆహ్వానం

విజయవాడ: విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవం, కళలు, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మరియు విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలకు హాజరు కావాలని పలువురు రాష్ట్ర మంత్రులకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆహ్వానం పలికారు.

ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథిలను ఎంపీ కేశినేని చిన్ని కలిసి, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మరియు విజయవాడ ఉత్సవ్ 2.0కు సంబంధించిన ఆహ్వాన పత్రికలను అందజేశారు.

విజయవాడ కనకదుర్గమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు కలిగిన ఆధ్యాత్మిక వేడుకలని, అదే స్ఫూర్తితో విజయవాడ నగర సంస్కృతి, కళలు, సంప్రదాయాలు, పర్యాటక విశిష్టతలను ప్రపంచానికి చాటిచెప్పేలా విజయవాడ ఉత్సవ్ 2.0ను ఘనంగా నిర్వహిస్తున్నామని ఎంపీ చిన్ని తెలిపారు.

గత ఏడాది విజయవాడ ఉత్సవ్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, ఈ ఏడాది మరింత భారీ స్థాయిలో, ప్రజల భాగస్వామ్యంతో ఉత్సవాలను నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0లో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని చాటాలని ఎంపీ కేశినేని చిన్ని కోరారు.

విజయవాడ ఉత్సవ్ ప్రతి విజయవాడ వాసి ఉత్సవమని, నగర ప్రజలందరూ ఈ మహోత్సవంలో భాగస్వాములు కావాలని ఎంపీ కేశినేని చిన్ని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ పొడపాటి తేజస్వి, పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.