Vijayawada: ఎంపీ కేశినేని చిన్నికి దసరా ఉత్సవాల ఆహ్వానం

Vijayawada: విజయవాడ దుర్గగుడి దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఎంపీ కేశినేని చిన్నికి అందజేసి, ఉత్సవ ఏర్పాట్లను వివరించిన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 1 Oct 2026 8:43 PM IST
Vijayawada
X

Vijayawada: ఎంపీ కేశినేని చిన్నికి దసరా ఉత్సవాల ఆహ్వానం

విజయవాడ: విజయవాడ(ఎంపీ కార్యాలయం)శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని)ను ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా దుర్గగుడి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్, ఆలయ అర్చకులు, సిబ్బంది, పాలకమండలి సభ్యులు ఎంపీ కేశినేని చిన్ని ని మర్యాదపూర్వకంగా అయన కార్యాలయం లో కలిసి దసరా ఉత్సవాల ఆహ్వానపత్రికను అందజేశారు.

అనంతరం దసరా ఉత్సవాల సందర్భంగా దేవస్థానం తరఫున చేపట్టిన ఏర్పాట్లను ఎంపీ కేశినేని చిన్ని కి వివరించారు. ఇప్పటికే పూర్తయిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతి, ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపడుతున్న చర్యలపై అధికారులు వివరించారు.

ప్రత్యేకంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన ఏర్పాట్లు, క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా చర్యలు తదితర అంశాలపై అధికారులు వివరించారు. దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

అలాగే మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై కూడా ఎంపీ కేశినేని చిన్ని కి వివరించారు. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని భద్రత, ప్రోటోకాల్, భక్తుల దర్శన ఏర్పాట్లు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.

దసరా ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు విజయవాడకు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, భక్తుల సౌకర్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని దసరా ఉత్సవాల ఏర్పాట్ల వివరాలను తెలుసుకుని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. విజయవాడ దసరా ఉత్సవాలు వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.