Vijayawada: ఈనెల 21 నుండి విజయవాడలో 41 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ!

Vijayawada: విజయవాడ ముత్యాలంపాడు సాయిబాబా గుడిలో అక్టోబర్ 21 నుండి నవంబర్ 30 వరకు 41 రోజుల పాటు ఉచిత ధ్యాన శిక్షణ ఉంటుందని గౌరవాధ్యక్షులు గౌతమ్ రెడ్డి తెలిపారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 23 Oct 2026 8:23 PM IST
Vijayawada
X

Vijayawada: ఈనెల 21 నుండి విజయవాడలో 41 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ!

Vijayawada: ఈనెల 21 నుండి నవంబర్ 30 వరకుహిమాలయ అమరగురు మహావతార్ బాబా ట్రస్ట్ నిర్వహణలో ఉచిత ధ్యాన శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ముత్యాలంపాడు ఆంధ్ర శిరిడి

సాయిబాబా మందిర గౌరవాధ్యక్షులు పి గౌతమ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయిబాబా మందిరంలో గౌతమ్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

బ్రహ్మహర్షి పితామహ పత్రీజీ దివ్య స్పూర్తితో, శ్రీ మహావతార్ బాబాజీ దివ్య సందేశాల ఆదేశాలతో.. బ్రహ్మశ్రీ పితామహ పత్రీజీ, శ్రీ మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని "41 రోజుల పాటు ఉచిత ధ్యాన శిక్షణా యజ్ఞం" నిర్వహిస్తున్నామన్నారు.

మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

ధ్యానం వల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, బుద్ధి కుశలత, దివ్య చక్షవు ఉత్తేజితం, సూక్ష్మ శరీర యానం, ఆత్మ విజ్ఞానం. లభిస్తాయన్నారు. భారతదేశ పేరు ప్రఖ్యాతలు ఖ్యాతి ధ్యానం వల్ల ఇనుమడింప చేయడం జరిగిందన్నారు.

ఎంతో కాలంగా మనదేశంలో ధ్యానాన్ని నలు దిశలా వ్యాపింప చేయడంలో అన్ని ప్రభుత్వాలు ముందున్నాయన్నారు. ఈ ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో షిరిడి సాయిబాబా మందిర ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.